ఇండియా డ్రోన్‌ టెక్నాలజీలో దూసుకుపోతోందా.. ప్రపంచ డ్రోన్‌ తయారీ హబ్‌ గా ఇండియా మారబోతోందా.. అంటే అవునంటున్నారు డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి. తిరుపతిలో జరిగిన ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ సదస్సులో పాల్గొన్న డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి.. దేశంలో మరే ప్రాంతంలో లేని రీతిలో ఓ చిన్న నగరం తిరుపతి పలు విద్యాసంస్థలు వెలిశాయని మెచ్చుకున్నారు.


దేశంలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయని.. ప్రముఖ సంస్థల విద్యార్థులు విదేశాలకు ఎగిరిపోకుండా స్థానికంగా అద్భుతాలు సృష్టిస్తున్నారని డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి అంటున్నారు. ఇండియాలో 70 వేల స్టార్టప్ లు పైబడి రిజిస్టర్ చేసుకొన్నారని.. దేశం డ్రోన్ ల తయారీ హబ్ గా మారబోతోందని డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. ఆవిష్కరణలు, స్టార్టప్ లకు దేశం అవకాశం కల్పిస్తోందన్న డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి.. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి రక్షణ శాఖ ఆధ్వర్యంలో రెండు పథకాలు ఉన్నాయని గుర్తు చేశారు.


ఐడెక్స్ పేరుతో యువతను ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నామన్న డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి.. టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ పేరుతో స్టార్టప్, ఎమ్ ఎస్ ఎం ఈ లను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో యువత అద్భుతాలు సృష్టించగలదన్న డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి.. యువత వినూత్న ఆవిష్కరణలు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. గతంలో ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థులు 75 శాతం విదేశాలకు వలస వెళ్లేవారని.. కానీ ఇప్పుడు ఇండియాలో వారు అనేక సంస్థలు స్థాపిస్తున్నారని డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు.


నిజమే.. ఇండియాలో సీన్ మారుతోంది. గతంలో మన దేశంలో మేథోవలస ఎక్కువగా ఉండేది. ప్రత్యేకించి అమెరికా వైపు మన కుర్రకారు చూసేది..కానీ ఇప్పుడు అనేక స్టార్టప్‌లు సక్సస్ అవుతున్నాయి. దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నాయి. తాము అభివృద్ధి చెందుతూనే దేశాన్ని అభివృద్ది చేయాలని తపించే యువత సంఖ్య పెరుగుతోంది. ఇక భవిష్యత్ అంతా ఇండియాదేనంటున్నారు మన విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: