సాప్ట్ వేర్ ఉద్యోగం అంటేనే ఎంజాయ్ మెంట్ లైఫ్ అని గతంలో ఉండేవి. శని, ఆదివారాలు సెలవు. అయిదు రోజులు మాత్రమే పని. అందులో వర్క్ లో ఎంటర్ టైన్ మెంట్ లగ్జరీ లైఫ్ ఇలా ఒక్కటేమిటి ఎన్నో అనుభవించారు. కరోనా తర్వాత కొంత వర్క్ స్టైల్ మారినప్పటికీ సాప్ట్ వేర్ ఉద్యోగానికి మిగతా ఉద్యోగాలకు ఉన్న తేడా అంతా ఇంతా కాదు. ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎంతో వేగంగా సాలరీ ఇంక్రిమెంట్, ప్రమోషన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో వస్తాయి. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడాా తమ పిల్లల్ని సాఫ్ట్ వేర్ సైడ్ వెళ్లేలా చేస్తున్నారు.


కానీ ప్రస్తుతం కార్పొరేట్, సాప్ట్ వేర్ సంస్థల్లో వారు ఇస్తున్నటువంటి ల్యాప్ టాప్ లో ఒక టైమ్ యాప్ వేస్తున్నారట. సదరు ఉద్యోగి లాగిన్ అయిన తర్వాత ఎంత సమయం పనిచేస్తున్నారు. వారి పనితనం, గంటలు, నిమిషాలు, సెకన్లను సైతం లెక్కిస్తూ పని చేయనట్లు గ్రహిస్తే వెంటనే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని సమాచారం. ఇదంతా ఎలా వెలుగులోకి వచ్చిందంటే బ్రిటన్ కొలాంబియా సంస్థలో పనిచేస్తున్న ఓ కెనడా అకౌంటెంట్ ను ఆ కంపెనీ తీసేసింది. దీంతో సదరు ఉద్యోగిని కోర్టు మెట్లెక్కింది. నేను ఏ తప్పు చేయకుండా నన్ను కంపెనీ అకారణంగా తొలగించింది. దీనికి సరైన కారణాలు తెలపాలని కోరింది.


దీంతో ఆ కంపెనీ ఆమె పని చేసే ల్యాప్ ట్యాప్ లో టైమ్ యాప్ వేశాం. దీంతో ఆమె చేస్తున్న పని ఎంటి, ఎప్పుడు లాగిన్ అయ్యారు. ఎన్ని ఫైల్స్ చూశారు. ఎంత సేపు పనిలో గడుపుతున్నారు. తదితర వివరాలను పూస గుచ్చినట్లు కోర్టుకు చెప్పిందంటా సదరు కంపెనీ. అయినా ఆ కంపెనీకి కోర్టు ఫైన్ వేసిందటా కానీ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే అంతటా వ్యాపిస్తోంది. పనిని సెకన్లు, నిమిషాల వ్యవధి లెక్కన చూస్తే ఎంతమంది ఉద్యోగాలు పోతాయో తలుచుకుంటేనే భయమేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: