ఒకానొక సందర్భంలో కేరళ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. రోడ్ షోలు గాని బహిరంగ సభలు గాని సామాన్య ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ కు ట్రాఫిక్ డైవర్షన్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి. అలాంటి ఇబ్బందులు కలిగే ఏ పాదయాత్ర అయినా గాని నిర్వహించడానికి వీలులేదని ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పుని జగన్ ప్రభుత్వం వైసీపీ నాయకులు ప్రతిపక్షాలకు సూచిస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకులు మాత్రం మీరేమో స్వేచ్ఛగా పాదయాత్ర ఓదార్పు యాత్ర అని రాష్ట్రంలో వందల రోజులు తిరగచ్చు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రజా సమస్యలపై గళ మెత్తడానికి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి పాదయాత్ర చేయాలనుకుంటే మాత్రం నిరాకరిస్తారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఈ పాదయాత్రల గురించి రాష్ట్రంలో తీవ్రంగానే చర్చ నడుస్తుంది.లోకేష్ పాదయాత్రకు అనుమతి వస్తుందా రాదా పవన్ బస్సు యాత్రకు అంగీకారం తెలుపుతారా ఉండదా అనే చర్చలతో వాడి వేడిగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. మరి జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. పాదయాత్రకు అనుమతిస్తుందా ఇవ్వదా? ఒకవేళ ఇస్తే ఎలాంటి షరతులతో ఇస్తుందనేది త్వరలోనే తేలనుంది.