ప్రస్తుతం భారత్ కు ఒక అతిపెద్ద కంపెనీ రానుంది. అదే బ్లాక్ బెర్రీ కంపెనీ. ఈ బ్లాక్ బెర్రీ కంపెనీ కెనడాకు చెందిన ఐఓసీ కంపెనీ. ఇది సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.  భారత్ లో ఈ కంపెనీ పెట్టడం ద్వారా నూతన ఇంజనీరింగ్ పరికరాలను వెలుగులోకి తీసుకురానుంది. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్లాక్ బెర్రీ సంస్థ అనేది అభివృద్ధి చెందుతున్న దేశంలో భారత్ లో మొదటిసారి పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకుంది.


ఇప్పటివరకు కెనడాలో మినహా ఎక్కడ ఈ బ్లాక్ బెర్రీ సంస్థ తన ఉత్పత్తులను తయారు చేసింది లేదు. భారత్ ని ఎంచుకోవడానికి కారణం ఇక్కడున్న మార్కెటింగ్ అని తెలుస్తుంది. కానీ ఇన్ని పెట్టబడులు వస్తున్నా రాజకీయంగా ప్రధాని మోదీపై ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా కేటీఆర్ చేస్తున్న విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్రం, రాష్ట్రం చేసే అన్ని పనులను ప్రజలు గమనిస్తూనే ఉంటారనడంలో సందేహం లేదు.


తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిసారి ప్రధాని మోదీని ఏం సాధించారని విమర్శిస్తూ ఉంటారు. పెట్టుబడులు తీసుకురావడంలో కొత్త కొత్త పరిశ్రమలను తేవడంలో కేంద్ర ప్రభుత్వం లోని బీజేపీ విఫలమవుతుందని ఆరోపణలు చేస్తుంటారు. మళ్లీ అదే కేటీఆర్ గుజరాత్ కు పరిశ్రమలు తీసుకెళ్తున్నారు ఆదానికి అప్పనంగా కట్టపెడుతున్నారు అంటూ విమర్శలు చేస్తారు. హైదరాబాద్ కు అమెజాన్ వచ్చింది,ఆపిల్ వచ్చింది, అంటూ హైదరాబాద్ గొప్పదనం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం గురించి పదే పదే చెప్తారు.


పరిశ్రమలు హైదరాబాద్ రావడానికైనా, గుజరాత్ వెళ్లడానికైనా మధ్యలో కేంద్ర ప్రభుత్వం అనేది ఉంటుంది. కేటీఆర్ సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తీవ్ర విమర్శలు కేంద్ర ప్రభుత్వంపై చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చిన తర్వాత ఎలాంటి సంస్థలు రాలేవని నూతన పరిశ్రమలు తీసుకురావడంలో పెట్టబడులు తీసుకురావడంలో తీవ్రంగా  విఫలమయ్యారని విమర్శిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: