గతంలోకి వెళ్తే ఎన్టీఆర్ ని గద్దె దించే టైంలో పెట్టిన సమావేశంలో చంద్రబాబు నాయుడు తో పాటు ఆ సమావేశానికి రజనీకాంత్ కూడా వచ్చారు. ఆ సమావేశానికి రజనీకాంత్ ను అతని మిత్రుడైన మోహన్ బాబు గారు తీసుకొచ్చారని తెలుస్తుంది. రజనీకాంత్ అప్పుడు రావడం మాత్రమే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకొని ప్రజలకు, పార్టీకి అన్యాయం చేశారని ఆయన అప్పుడు అనడం జరిగిందట. అయినా కూడా, అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత కూడా 220 సీట్ల తో భారీ విజయాన్ని సాధించారు అప్పుడు. ఆ తర్వాత ఈ సమావేశం అంతా ఒక ప్లాన్ అని తెలిసిన రజనీకాంత్ గారు దీనిపై పశ్చాత్తాప పడి, సీనియర్ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగిందని కూడా స్టేట్మెంట్ ఇచ్చారట అప్పుడు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తమకు సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు ఉందని ఆయన ఫోటోను సైకిల్ మీద వాడుతూ ఉండడంతో అప్పట్లో రజినీకాంత్ గారు పత్రిక పూర్వకంగా ఒక హెచ్చరిక జారీ చేశారట. చట్టబద్ధకం అయిన హెచ్చరిక చేస్తున్నాను నా ఫోటోని వాడడానికి వీలు లేదు అని ఆ తర్వాత ఆయన అన్నారని తెలుస్తుంది. కానీ ఇప్పుడు రజనీకాంత్ స్పెషల్ గెస్ట్ గా రావడం పై ఇది మోడీకి, బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నం అని అంటున్నారు లక్ష్మీపార్వతి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి