అప్పట్లో వాళ్లందరూ ఉచిత విద్యుత్ అనేది అసంభవం అన్నవాళ్లే అని తెలుస్తుంది. అప్పట్లో ఉద్యమం చేసే వాళ్ళని లాఠీలతో కొట్టించిన, గుర్రాలతో తొక్కించిన ప్రభుత్వ తీరును వీళ్ళు ఎవరు విమర్శించలేదని తెలుస్తుంది. అయితే విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు లెక్కల్లోనే లేదు. ఒకవేళ బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఉన్నా కూడా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మాటను కాదనే పొజిషన్ లేదు.
అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వై యస్ రాజశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానం కాదంటున్నా కూడా ఉచిత విద్యుత్తును ఇప్పించడం జరిగింది. నిధులు లేవంటున్నా కూడా తన పూచీ కత్తు మీద ఆనాడు ఉచిత విద్యుత్ ఇప్పించిన వైయస్ రాజశేఖర్ రెడ్డికి కొడుకైన వైయస్ జగన్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా ఉన్నాడు. ఆయన కొడుకు అయిన జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి విడివడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పరచాడు.
అయితే తెలంగాణలో ఈ విషయాన్ని చెప్తున్న కేటీఆర్ అలాగే ఆయన తండ్రి కెసిఆర్ కూడా గతంలో తెలుగు దేశానికి సంబంధించిన, తెలుగుదేశం నుండి వచ్చిన వ్యక్తులే. ఇలా ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న వ్యక్తులు, అలాగే కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులు కూడా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే అవ్వడం ఇక్కడ గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి