జగన్ చంద్రబాబు లాగానే గతంలో ఇలాంటి ఒక పద్మవ్యూహం లోనే చిక్కుకుపోయారు. ఎవరో ఆధారాలు లేకుండా వ్రాసిన ఒక లెటర్ ఆధారంగా ఆయనని అరెస్టు చేయడం జరిగింది. అప్పుడు ఆయనకు సంబంధించిన ఆ కేసును ఎంక్వయిరీ చేస్తామని మొదటగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని స్వయంగా పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అరెస్టు కూడా చేశారు అప్పుడు ఆయనను.


తిరిగి దానిపై కస్టోడియల్ ఎంక్వయిరీ కూడా జరిపారు. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చే సందర్భంలో తిరిగి మరో కేసు ఆయనపై ఆపాదించడం జరుగుతూ ఉండేది. అలా ఆయనకు బెయిలు వస్తుంది అనే సమయానికి ఒక కొత్త కేసు ఆయన పై పడుతూ ఉండేది. ఇలా ఒక 16నెలలు ఆయన ఇలాంటి వ్యూహంలోనే చిక్కుకుపోయారని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి కష్టడి వరకు వెళ్తారని అసలు ఎవరూ అనుకోలేదు.


ఆ తర్వాత రిమాండ్ కూడా విధించాలని అనుకున్నారు. రిమాండ్ విధించినా కేసు క్వాష్ అయిపోతుందని అనుకున్నారు. కానీ ఇవేవీ జరగలేదు. అలా ఎన్ని అనుకున్న ప్రస్తుతానికి ఆయన కస్టడీ విచారణలో ఉన్నారు. ఆ తర్వాత మొన్న హైకోర్టులో బెయిల్ రాకపోయేసరికి ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆ సమయానికి ఆయనపై రెండు కేసులకు సంబంధించి పిటి వారెంట్లు రెడీగా ఉంటాయని అంటున్నారు.


 ఒక కేసు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినది కాగా, రెండో కేసు ఫైబర్ గ్రిడ్ గురించి అని తెలుస్తుంది. అయితే వాటిపై విచారణ వాయిదా వేశారని తెలుస్తుంది.  కానీ ఇక్కడ క్వాష్ కొట్టేశారు కాబట్టి వాటి విచారణలు ఇక మొదలు పెడతారని అంటున్నారు. అంటే మళ్లీ పిటి వారెంట్లు, ఆరెస్టులు, కస్టడీ విచారణలు ఇవన్నీ వరుసగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఫేస్ చేయబోతున్నారు. హెల్తీ ఇష్యూస్ చూపిస్తే గాని సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రాదని అంటున్నారు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: