జయప్రకాశ్ నారాయణ అనగానే నీతి నిజాయతీ గల మాజీ ఐఏఎస్‌ ఆఫీసర్ అనే అందరికీ తెలుసు. రాజకీయాల్లో లోక్ సత్తా పార్టీని పెట్టి ప్రజలకు ఏదో సేవ చేయాలని అనుకున్నారు. కానీ రాజకీయాల్లో ఉన్న మురికి తట్టుకోలేక.. ఆయన ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఒక మేధావిగా మాత్రం రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నారు.  ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు.


గతంలో లోక్ సత్తా పార్టీ తరఫున కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఈయన టీడీపీకి సపోర్టు చేస్తాడని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం మరో పార్టీకి వత్తాసు పలికేలా మాట్లాడతారని ఇంకొకరు రాజకీయ విమర్శలు చేయడం ఇలా ఎవరికి వారు రాజకీయ బురదలో కి లాగి తన క్యారెక్టర్ పై ప్రజలకు అనుమానం కలిగేలా చేశారు. అయినా జేపీ ఎక్కడ కూడా తొణకకుండా నిలబడ్డాడు. కానీ రాజకీయాలు తనకు అచ్చి రావని ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు.


గతంలో చలసాని శ్రీనివాస్... ఆంధ్ర ప్రదేశ్ మేధావి వర్గంని నడిపేవారు. ఆ తర్వాత కృష్ణారెడ్డి నడిపించారు. న్యూట్రల్ గా పార్టీ ఓరియంటెడ్ గా కనిపించే వారు  మాజీ ఎన్నికల ప్రధాన కార్యదర్శి సంపత్, ప్రొఫెసర్ దాసు ఉన్నారు.  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం తెలుగు దేశం అనుకూలురు. జస్టిస్ భవాని ప్రసాద్ పార్టీలకు ఎక్కడ సపోర్టు చేసినట్లు కనిపించలేదు.  ఎల్ వీ సుబ్రమణ్యమం న్యూట్రల్ గానే ఉన్నారు. జంధ్యాల శంకర్ మాజీ పొలిటిషీయన్ వీరితో కలిపి మేధావి వర్గం ఏర్పడనుంది.


దీన్ని ఎటు తీసుకెళతారు. తెలుగుదేశం అనుకూలంగా మాట్లాడతారా? లేక మేధావఫోరంగా తీసుకెళతారా? చూడాలి. అయితే జగన్ చేసిన తప్పులు... బాబు చేసిన తప్పులు రెండింటిని తీసుకెళితే సమాజం హర్షిస్తుంది. కానీ ఒక వైపు మాత్రమే మాట్లాడితే ఎవరూ ఊరుకోరు. మేధావి ఫోరం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: