అయితే ఇప్పుడు చంద్రబాబు తదుపరి కార్యచరణ ఏంటి? ఈ నెల 29 నుంచి ప్రజల్లోకి వెళతారా? ఎక్కడ అయితే అరెస్టు చేశారో అక్కడి నుంచే పోరు మొదలు పెడతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు రాజకీయ చతురుడు. ఎన్టీఆర్ లాంటి మహా శక్తిమంతమైన నేతనే గద్దె దించి టీడీపీలో తనకు అనుకూల వాతావరణం సృష్టించుకోగలిగారు. మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంలోను ఆయన కోసం అర్ధరాత్రి, తెల్లవారుజామున దాదాపు 14గంటలు ప్రజలు ఎదురు చూశారు. అది ఆయన స్థాయి.
ఏపీలో పవన్ కల్యాణ్ ఇమేజ్ ఒక్కసారిగి పెరిగింది. ఇప్పుడు జనసేన అధినేతను తన వైపు తిప్పుకోవడంలో సఫలం అయ్యారు. ఒకానొక సందర్భంలో త్రిముఖ వ్యూహం పన్ని నారా లోకేశ్ యువగళం పాదయాత్ర, ఇటు భవిష్యత్తుకు బాబు ష్యురిటీ అంటూ చంద్రబాబు యాత్ర, మరోవైపు జనసేన అధినేత వారాహి యాత్ర పేరుతో వైసీపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేశారు.
దీంతో కలవారు పాటుకు గురైన వైసీపీ చంద్రబాబుని జైల్లో పెట్టి వాటి అన్నింటిని అదుపు చేయడంలో విజయవంతం అయ్యారు. ఇప్పుడు చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇది వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. విడిగా ఉన్నప్పుడే పవన్, చంద్రబాబులు ముప్పేట దాడి చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో అని వైసీపీ నేతలు కూడా కలవరపాటుకు గురవుతున్నారు. ఇప్పటి నుంచి జగన్ కు అసలైన సినిమా చూపిస్తారని టీటీపీ నాయకులు పేర్కొంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి