తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులో సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులు అనారోగ్యంతో మృతి చెందడం కూడా అంతే సంచలనం సృష్టిస్తోంది.  వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారని..  ఈ మేరకు దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.


ఇప్పటి వరకు శ్రీనివాసుల రెడ్డి, కువైట్ గంగాధర్‌ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్ మెన్ రంగన్న లు మృతి చెందారు. వీరి మరణాలు ఒకే తరహా కారణాలతో సంభవించాయంటూ కీలక వ్యాఖ్యలతో పాటు అనుమానాలు వ్యక్తం చేశారు.


ఇక కీలక సాక్షిగా ఉన్న వాచ్‌ మెన్ రంగన్న కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.  రంగన్న భార్య సుశీల తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అయితే, ఇటీవల కేసులో వైఎస్ అభిషేక్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయయని.. వీటిపై లోతుగా దర్యాప్తు చేపడతాం అంటూ ఎస్పీ అశోక్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు..  అసలు, వైఎస్‌ వివేకా కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఎందుకు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు ఎస్పీ అశోక్ కుమార్.


వివేకా హత్య కేసులో వరుసగా నలుగురు సాక్షులు చనిపోయారు… అందుకోసం రంగన్న మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేశాం… రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నాం… సాక్షులు మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయి అన్నారు.. అసలు ఎందుకు సాక్షులు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు. సాక్షుల మృతి వెనక పోలీస్, సీబీఐ ఉన్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. రంగన్న మృతిలో హై ప్రొఫెషనల్ మర్డర్ గా అనుమానం ఉందన్నారు ఎస్పీ అశోక్ కుమార్..మరి చివరకు ఏంజరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: