టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (INFOSYS), హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ (HCL TECHNOLOGIES), విప్రో (WIPRO) సంస్థలు భారీగా ఫ్రెషర్స్ ను ఉద్యోగాలలో తీసుకునేందుకు ప్రణాళిక చేపట్టనున్నాయి. కరోనా తర్వాత ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నాలుగు కంపెనీలు కలిపి సుమారుగా 91,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకునే అవకాశం ఉంది.