పది, ఆపై చదివారా.. ఉద్యోగం రావడం లేదని బాధపడుతున్నారా..అయితే ఫ్రీగా జాబ్ వచ్చే కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఉచిత శిక్షణ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా హైదరాబాద్ నగరంలోని నిరుద్యోగ యువతకు ఫ్రీ గా ట్రైనింగ్ ఇస్తోంది.

 

ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ సంస్థ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థి వయస్సు 18 నుంచి 32 ఏళ్ల లోపు ఉండి.. టెంత్ ఆ పై విద్యార్హత ఉండాలి.

 

ఏ ఏ ఏ ఏ కోర్సులు అంటే.. యానిమేటర్, జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 27వ తేదిలోపు వనస్థలిపురం పనామ వద్ద ఉన్న కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలు కావాలంటే.. 040295 53298,93818 53544 నెంబర్లలో సంప్రదించొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: