చాలా మంది డిగ్రీ పాస్ అయిన తరువాత ఏం చేయాలో అర్థం కాక సమయం వృథా చేస్తూ ఉంటారు. అలాంటి వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎస్బీఐ "ఎస్బీఐ యూత్ ఫెలో షిప్ " పేరుతో నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి ఉన్నవారికి ఈ ఫెలో షిప్ ఉపయోగపడుతుంది. 
 
దరఖాస్తు చేసుకున్న వారిలో ఫెలో షిప్ కు ఎంపికైన వారు 13 నెలల పాటు గ్రామాల్లోకి వెళ్లి గ్రామాల్లో పరిస్థితులు, సమస్యలు, ఇతర విషయాల గురించి సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నిపుణులు, ఎన్జీవోల ప్రతినిధులు వీరికి సహాయసహకారాలు అందిస్తారు. గ్రామీణ భారతంలోని సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల అవగాహన, ఆసక్తి, అభిరుచి ఉన్నవారిని ఎస్బీఐ ఎంపిక చేస్తుంది. 
 
డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పాసైన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చదివే విద్యార్థులు ఆ సంవత్సరం ఆగస్టు నాటికి ఉత్తీర్ణులు కావాలి. 21 నుంచి 32 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు https://register.you4.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫెలోషిప్ కు నేపథ్యం, వృత్తి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: