కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల ఇప్పుడు ఆన్లైన్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. పెద్ద పెద్ద విద్యా సంస్థలు సైతం ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి.ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ కోర్సుకి ఎంత డిమాండ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కోర్సుకి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కోర్సుని చాలా తక్కువ ఖర్చుతో మీ ఊహకు అందని ఖర్చుతో మీరిప్పుడు నేర్చుకోవచ్చు.తాజాగా దేశంలోనే ప్రముఖ పెద్ద విద్యా సంస్థ అయిన ఎన్ఐటీ వరంగల్(NIT Warangal) ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్(Artificial Intelligence and Deep Learning Applications) కోర్సును చాలా తక్కువ ధరకే అందిస్తోంది.దీని కోసం కేవలం రూ. 500లను మాత్రమే ఫీజుగా నిర్ణయించింది. అయితే ఇక్కడ ఓ చిక్కుంది.

కేవలం 50 సీట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు అధికారులు తెలిపారు. అందుకే మొదటగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.ఇక ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ-సర్టిఫికేట్ ను సైతం అందించనున్నారు. ఇంకా ఫాకల్టీ, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైనా ఈ కోర్సు కోసం అప్లై చేసుకోవచ్చు. ఐఐటీ, ఎన్ఐటీ, సెట్రల్ యూనివర్సిటీ తో పాటు అలాగే USAకు చెందిన వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభ్యర్థులకు కోర్సును బోధించనున్నారు. ఇక ఈ కోర్సు జులై 5న స్టార్ట్ కానుండగా జులై 9 వరకు కొనసాగనుంది.ఇక అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 4లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో తెలపడం జరిగింది.

ఇక ఈ కోర్స్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..

ఈ కోర్సుకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక గూగుల్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫామ్ ను cce@nitw.ac.in, raju@nitw.ac.in కి జులై 4లోగా మెయిల్ చేయాల్సి ఉంటుంది.ఇక ఏమైనా సందేహాలుంటే 9700553922, 8332969733 నంబర్లను సంప్రదించండి. లేదంటే cce@nitw.ac.in, raju@nitw.ac.inకు మెయిల్ చేయ్యండి.ఇంకెందుకు ఆలస్యం వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇంట్రెస్ట్ వున్న అభ్యర్థులు వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: