బంగారం ధరలలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక్క రోజు ధర పెరిగితే.. మరో రోజు ధర తగ్గుతుంది. కరోనా, ఒమిక్రాన్ కారణంగా దేశంలో పలు పాంత్రాల్లో బంగారం ధర స్థిరంగా ఉన్నా.. మరికొన్ని ప్రాంతాల్లో బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తున్నాయి. కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న ధరలు.. ఇటీవల మళ్లీ పెరిగాయి. బంగారం రేటుతోపాటు వెండిధరలు కూడా ఆకాశాన్నంటాయి. నేడు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,130 ఉండగా.. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,420కి చేరింది. అలాగే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100 వద్దకు చేరింది.

అలాగే తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,440కి చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,180 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,880గా ఉంది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090గా కొనసాగుతోంది. అలాగే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,990 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,990 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090గా ఉంది. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,990 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 వద్దకు చేరింది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 వద్దకి చేరింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.65,500గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: