సబ్జా గింజలలో ఫైబర్ అధిక మొత్తంలో ఉండడం కారణంగా త్వరగా ఆకలి వేయదు. అంతేకాకుండా వీటిలో ఒమేగా త్రీ ఆమ్లాలతో పాటు ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం పుష్కలంగా లభిస్తుంది. ఇక ఇందులో పిండి పదార్థాలు తక్కువగానూ,ప్రోటీన్లు ఎక్కువగానూ ఉంటాయి. వీటిని రోజు మంచి నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.