కుండలోని నీళ్లు తాగడం వల్ల పిహెచ్ బ్యాలెన్స్ ను సమతుల్యం చేసుకోవచ్చు. అంతేకాకుండా అసిడిటీ, మలబద్ధకం, గాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు కూడా దరిచేరవు. అలాగే సహజ పద్ధతి ద్వారా మట్టి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహజ మినరల్స్,ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించి, ఎనర్జీని అందిస్తుంది. కుండ లో నీటికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కుండలో నీటిని తాగడానికి అలవాటు చేసుకోవాలి...