బయట దొరికే నాసిరకం ఆక్సీ మీటర్ల వల్ల ఆ మీటర్ ను వేలుకు పెట్టకపోయినా, ఏదైనా వస్తువును పెట్టినా అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ పరికరంలో తమ వివరాలను చెక్ చేసుకుని వ్యక్తులు వెంటనే ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. సరైన పల్స్ రేటును చూపించడం లేదు, నార్మల్ గా ఉన్నప్పటికి పల్స్ రేట్ పడిపోయినట్లు చూపిస్తోంది. ఏలూరు నగరంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి ఆక్సీ మీటర్ ని కొనుగోలు చేసి, దాని ద్వారా ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించుకోగా సాధారణంగా ఉండాల్సిన 95 నుండి పైబడి కాకుండా, 85 శాతం నుండి దిగువ చూపించడం ప్రారంభించింది. అతను వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పరుగులు తీశాడు. తీరా ఆస్పత్రిలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరంతో పల్స్ రేట్ ను పరీక్షించగా అది 95% కంటే ఎక్కువ చూపించగా తన ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉన్నట్టు గుర్తించారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇలాంటి నాసిరకం ఆక్సీమీటర్ల ను అమ్మడానికి కారణం ఉన్నతాధికారులు తనిఖీ లేకపోవడమేనని ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు.