మానవుని శరీరంలో ఆక్సిజన్ కొరతను కనిపెట్టడానికి "పల్స్ ఆక్సీమీటర్ " సహాయంతో తెలుసుకోవచ్చు. ఆక్సీమీటర్ మన చేతి వేలికి పెట్టుకుంటే చాలు, అది మన శరీరంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో తెలియజేస్తుంది. మానవుని శరీరంలోని 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ ఉంటే, మనం వెంటనే వైద్యుని సంప్రదించాలి.. ప్రోనింగ్ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ప్రోనింగ్ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం. ఛాతి, పొట్ట భాగంలో బరువు పడే విధంగా బోర్లా తిరిగి పడుకోవడం, లేదంటే ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు అవసరమైన స్థాయిలో ఆక్సిజన్ అందుతుంది. ఈ పద్ధతిని ప్రోనింగ్ అని అంటారు. ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ కి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది అని వైద్యులు తెలియజేస్తున్నారు. కాబట్టి మీలో కూడా ఆక్సిజన్ స్థాయిలు పెరగాలంటే ఈ ప్రోనింగ్ వ్యాయామాన్ని ఖచ్చితంగా చేయాలి.