ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ హడలిపోయారు. ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న సమయంలోనే బ్రిటన్ లో కరోనా న్యూ స్ట్రెయిన్ కేసులు నమోదు అవడంతో అటు బ్రిటన్ లోనూ, ఇటు దక్షిణాఫ్రికాలోను ఈ కేసులు అధికమవడంతో తిరిగి ఆ దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఆఫ్రికా దేశం టాంజానియాలో తాజాగా మరో వింత రకం వ్యాధి అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.                                                      

టాంజానియాలోని ఎంబేయా ప్రాంతంలోని ప్రజలు ఈ వింత వ్యాధి వల్ల రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. ఇలా రక్తంతో కూడిన వాంతులు అయినా గంట వ్యవధి లోపే మరణిస్తున్నారు. ఈ విధంగా ఆ ప్రాంతంలో వింత వ్యాధి బయటపడడంతో వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందం చేరుకొని ఈ వ్యాధికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కొత్త రకం వ్యాధితో 15 మంది మరణించగా దాదాపు 50 మంది వరకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆరోగ్య శాఖ తెలియజేసింది.

టాంజానియాలో బయటపడిన ఈ వింత వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించిందనే ఉద్దేశంతో వైద్య బృందం అన్ని ప్రాంతాలలో ప్రజల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు వైద్య అధికారులు తెలియజేశారు. అయితే ఇతర ప్రాంతాలలో నివసించేటటువంటి ప్రజలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇంతవరకు ఎవరు వైద్యులను సంప్రదించక పోవడంతో ఈ వ్యాధి వేరే ప్రాంతాలకు వ్యాపించి ఉండదని అధికారులు భావిస్తున్నారు. అయితే అంతుచిక్కని ఈ కొత్త రకం వ్యాధి బయట పడటం వల్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ వైద్య అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: