ప‌టిక‌బెల్లం అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది తియ్యటి రుచిని కలిగి ఉంటుంది. చెక్కర యొక్క శుద్ధి చేయబడని రూపమే ఈ పటికబెల్లం. దీన్ని వంటల్లోనూ మరియు వైద్య ప్రయోజనాల కోసం వాడతారు. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వ‌ల్ల క‌లిగే అనేక రోగాల‌కు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే ప‌టిక బెల్లంతో మ‌న‌కు క‌లిగే ఇతర ఉపయోగాలు ఏమిటోఇప్పుడు తెలుసుకుందాం.



పటిక బెల్లం లో ఎస్సెన్షియల్ విటమిన్స్, మినరల్స్, ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి. బీ12 అనే విటమిన్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్చెస్ నుండే లభిస్తుంది. ఆ విటమిన్ ఈ పటిక బెల్లం నుండి కూడా లభిస్తుంది. ఇది ఇంకా ఎందుకు పనికొస్తుందో చూద్దాం రండి.భోజనం చేసిన తరువాత మౌత్ వాష్ చేసుకోకపోతే లోపల ఉండే బ్యాక్టీరియా వల్ల నోరు వాసన వస్తుంది. భోజనం తరువాత పటిక బెల్లం కొంచెం చప్పరిస్తే శ్వాస తాజాగా ఉంటుంది. నోరు కూడా ఫ్రెష్ గా ఉంటుంది.జ్వరం వచ్చినా, గొంతులో జర్మ్స్ ఉన్నా దగ్గు వస్తుంది. పటిక బెల్లం లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వలన ఇమ్మీడియెట్ గా దగ్గు తగ్గుతుంది. కొంచెం పటిక బెల్లం తీసుకుని నెమ్మదిగా చప్పరిస్తే దగ్గు నుండి రిలీఫ్ వస్తుంది.చల్లని వాతావరణం వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో గొంతు ఇబ్బందిగా మారడం కూడా ఒకటి.


పటిక బెల్లం ఇందుకు బాగా పని చేస్తుంది. కొద్దిగా పటిక బెల్లాన్ని మిరియాల పొడి, నెయ్యి తో కలిపి రాత్రి పూట తీసుకోండి.హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఎనీమియ, చర్మం పాలిపోవడం, డిజ్జీనెస్, నీరసం, నిస్త్రాణ వంటి వాటితో సఫర్ అవుతారు. పటిక బెల్లం హిమోగ్లోబిన్ లెవెల్స్ పెచడమే కాదు, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ని రీజెనరేట్ చేస్తుంది కూడా.నోరు ఫ్రెష్ గా ఉండడానికే కాదు పటిక బెల్లం అరుగుదలకి కూడా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా సోంపు గింజలతో కలిపి తీసుకుంటే అందులో ఉండే డైజెస్టివ్ ప్రాపర్టీస్ అరుగుదలకి హెల్ప్ చేస్తాయి. భోజనం తరువాత కొద్దిగా పటిక బెల్లం తీసుకునే అలవాటు చేసుకోండి.

 ముక్కులో నుండి రక్తం కారడాన్ని కూడా పటిక బెల్లం ఆపుతుందంటే కొద్దిగా ఆశ్చర్యం గానే ఉంటుంది. ముక్కు లో నుండి రక్తం కారుతున్నప్పుడు కొద్దిగా పటిక బెల్లన్ని నీటితో కలిపి తీసుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది.పటిక బెల్లం మెదడుకి బాగా మేలు చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మెంటల్ ఫెటీగ్ ని దూరం చేస్తుంది. రాత్రి నిద్రకి ముందు పటిక బెల్లాన్ని కొద్దిగా వెచ్చని పాలలో కలుపుకుని తాగండి. ఇలా చేస్తే మెమరీ బాగా పెరుగుతుంది.
పటిక బెల్లం బాలింతలకి పాలు పడేలా చేస్తుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ గా కూడా పని చేస్తుంది. ఇందులో తీపి తక్కువ, తల్లికి దీని వల్ల ఎలాంటీ హానీ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: