
మునగతో ఎన్నో రకాల వెరైటీలు చేసుకోవచ్చు. సాంబరు, రసం, పులుసు.. ఇలా ఎందులో వేసినా మాంచి టేస్ట్ ఇస్తుంది. కేవలం రుచి మాత్రమే కాదండోయ్.. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. మునగలో ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మరి వాటివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో చూద్దామా!
మునగలో అధికంగా లభించే కాల్షియం, ఇనుము తదితర విటమిన్లు ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి.పిల్లలు మునగను కూరలా తిన్నా, సూప్ రూపంలో తాగినా ఎముకలు గట్టి పడతాయి.రక్త శుద్ధికి మునగలో ఉండే గింజలూ, ఆకులు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటాయి.మునగ యాంటీబయోటిక్ కారకంగానూ పనిచేస్తుంది. మునగను తరుచుగా తీసుకోవడం వల్ల మొటిమలతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.మునగ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కనుక డయాబెటీస్ బాధితులకు కూడా ఇది మంచిదే. గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల్ని మునగ అదుపులో ఉంచుతుంది. మహిళ్లలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.
గర్భిణీలు మునగను తీసుకోవడం వల్ల ప్రసవానికి ముందు, తర్వాత వచ్చే సమస్యల్ని అధిగమించవచ్చు. చనుబాలు సమస్యతో బాధపడే తల్లులకు మునగ మేలు చేస్తుంది.మునగ లైంగిక శక్తిని కూడా పెంపొందిస్తుంది.మునగ కాడల్లోనే కాదండోయ్ దాని ఆకులు, పూలల్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.మునగలోని విటమిన్-C ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. శరీరానికి హాని చేసే ఫ్రీ రాఢికల్స్ ప్రభావాన్ని కూడా మునగ అదుపులో ఉంచుతుంది.మునగ వల్ల జీర్ణశక్తి పనితీరు మెరుగుపడుతుంది