
ఇక కంప్యూటర్ ముందు ఉద్యోగం చేసే వారికి ఈ కంటి చూపు సమస్య ఎక్కువ అవుతుందని పలువురు బాధితులు వాపోతున్నారు. అయితే కంటిచూపు సమస్యను తగ్గించుకోవాలి అంటే భోజనం చేసిన తర్వాత ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. కంటి చూపు పెరుగుతుంది అని వైద్యులు చెబుతున్నారు. ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందాం. సహజంగా మనం భోజనం చేయడానికి ఏదైనా హోటల్ కు , రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత కచ్చితంగా మనకు సోంపు గింజలు ఇవ్వడం అయితే జరుగుతుంది . అయితే భోజనం చేసిన తర్వాత ఎందుకు తీస్తారు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం బహుశా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు.
సోంపు గింజలలో ఎక్కువగా పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు,జింక్, క్యాల్షియం, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ సోంపు గింజలను భోజనం చేసిన ప్రతి సారి తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగు పరచడంతో పాటు ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే దూరమవుతాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వచ్చే జలుబు , దగ్గు వంటి సమస్యలను ఈ సోంపు గింజలు తిని ఇట్టే దూరం చేసుకోవచ్చు.