1) స్పూన్ గసగసాలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని వెచ్చని పాలులో వేసుకొని తాగాలి. అప్పుడు బాగా నిద్ర పడుతుంది.
2)పిల్లలకు వెంటనే జలుబు తగ్గాలంటే తమలపాకుని నలిపి అందులో నుంచి వచ్చే రసాన్ని నాకించాలి.
3)తుమ్ములు బాగా వస్తుంటే కొత్తిమీర నలిపి రసం వాసన చూస్తే తుమ్ములు తగ్గుతాయి.
4).వాతపరమైన నొప్పులతో బాధపడేవారు దాల్చిన చెక్కని ఎండబెట్టి చూర్ణం చేసుకొని రోజు వేడిపాల్లో ఒక స్పూన్ పొడిని కలుపుకుని తాగితే వాతపరమైన సంస్థ నొప్పులు తగ్గుతాయి.
5).ఎంతకీ తగ్గని పుండు పై సీతాఫలం ఆకులు మెత్తగా నూరి కట్టు కడితే వారం రోజులకు ఆ పుండ్లు తగ్గిపోతాయి.
*6).ఇంగువ,హారతి కర్పూరం, సమానంగా తీసుకుని కంది గింజంత ఉండలు చేసుకుని రోజుకో ఉండ వేసుకుంటూ ఉంటే ఉబ్బసం,ఆయాసం మరియు గుండె దడ తగ్గుతాయి.
7). నోటి పూత బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే కరక్కాయ అరగదీసి ఆదంతం నాలుక మీద రాసి తరువాత కరక్కాయ బెరడును చూర్ణం చేసి అర చెంచా చూర్ణాన్ని వేడి నీళ్లలో కలుపుకుని తాగితే నోటి పూత తగ్గుతుంది.
8).వేరుశనగ నూనెను ఒంటికి రాసుకొని మసాజ్ చేస్తే ఒళ్ళు నొప్పులు,కండరాల నొప్పులు తగ్గుతాయి.
9).సేగ గడ్డలు వస్తే బియ్యప్పిండి ఉడకబెట్టి కొంచెం వేడిగా సెగ గడ్డపై వేసి కట్టు కడితే సెగ గడ్డ త్వరగా చితికి పోతుంది.
10).కొబ్బరి నూనెలో హారతి కర్పూరం పొడి చేసి వేసి కలిపి రాస్తే దద్దుర్లు దురద తగ్గుతాయి.
11). రోజు పరగడుపున గ్లాసు నీళ్లలో సగం నిమ్మకాయ చక్కెర ఉప్పు వేసుకొని ఆ రసాన్ని తాగితే బరువు తగ్గుతారు.
12). గంధపు చెక్క అరగదీసి ఆ పేస్ట్ ని వాపుల మీద రాస్తే వాపులు త్వరగా తగ్గుతాయి.
13).కరక్కాయ ముక్క నోట్లో బుగ్గన పెట్టుకుంటే పొడి దగ్గు ఉపశమనం కలుగుతుంది.
14). ఆముదం తీసుకొని అరికాలకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి