
రోజుకు ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్ తక్కువ తిన్నా సరే పొట్ట నిండిన భావనను కలిగించి,ఎక్కువ తినడానికి ఆసక్తి లేకుండా చేస్తుంది.అంతే కాక ఫైబర్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్ లకు మంచి మూలకమైన బొప్పాయిని ఆహారంలో భాగంగా తీసుకోవడంతో పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడమే కాకుండా,తొందరగా బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.
జిమ్మ్,వ్యాయామం,నడక వంటి ఆక్టివిటీస్ చేయడానికి కూడా సమయం లేని వారికి రోజు బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.మరియు ఎవరైనా మలబద్ధకం,గ్యాస్,అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు అయితే రోజుకు ఒక 100 గ్రామ్స్ బొప్పాయి ముక్కలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఆ సమస్యలన్నీ క్రమంగా నెల రోజులలోపు తగ్గుముఖం పడతాయి.
అంతేకాక ఇందులో ఉన్న విటమిన్ ఏ,బీటా కెరోటిన్ కంటి చూపు,ముఖం మెరుపు సంతరించుకోవడానికి,జుట్టు ఒత్తుగా,బారుగా పెరగడానికి దోహదపడతాయి.మరియు ఇందులో వున్న యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు క్యాన్సర్ దరిదాపులకు రాకుండా కాపాడుతాయి.కావున ప్రతి ఒక్కరు రోజుకు ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోవడం,మరియు పిల్లలకి అందించడం చాలా ముఖ్యం.