ఇండియన్ వంటకాల్లో చింత చిగురును కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో అయితే చింత చిగురుతో చాలా రకాలైన వంటను చేస్తారు. ఇక వెజ్ లేదా నాన్ వెజ్ లో వేసి చేస్తారు.వీటి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చింత చిగురులోని పులుపు.. వంటకే మంచి రుచిని ఇస్తుంది.దీనివల్ల కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చింత చిగురును మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వారు పెద్దలు. అలాగే ఈ చింత చిగురును ఎండ బెట్టి పొడిగా చేసి కూడా వంట్లో ఉపయోగిస్తారు. చింత చిగురు కంది పప్పు, చింత చిగురు రొయ్యలు, చికెన్ కాంబినేషన్స్ చాలా రుచిగా ఉంటాయి.ఇక చింత చిగురుతో కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం.


ఈ చింత చిగురులో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్త హీనత సమస్య ఈజీగా తగ్గుతుంది.అలాగే చిన్న పిల్లలకు ఇది మంచి బలాన్ని అందించే ఆకు కూర.అలాగే చింత చిగురుకు కామెర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా ఉంది. మీరు చింత చిగురు నుంచి రసాన్ని తీయాలి. ఈ రసంలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగితే కామెర్ల వ్యాధిని ఈజీగా అదుపులోకి తీసుకు రావచ్చు.ఇక చింత చిగురును ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల వాతం వల్ల వచ్చే సమస్యలు ఈజీగా తగ్గతాయి. ఇంకా అలాగే మూల వ్యాధుల నుండి కూడా ఈజీగా ఉప శమనం లభిస్తుంది. ఇంకా అలాగే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.ఇక గొంతు నొప్పి సమస్యలకు కూడా చింత చిగురును ఉపయోగించవచ్చు. చింత చిగురును నీటిలో మరిగించి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, గొంతు వాపు ఇంకా గొంతులో మంట వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇంకా అలాగే చింత చిగురు తినడం వల్ల కడుపులో నులి పురుగులు నశిసిస్తాయి.ఈ చింత చిగురును తినడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ కూడా ఈజీగా పెరుగుతాయి. అందువల్ల ఇతర అనారోగ్య సమస్యలతో బాడీ పోరాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: