హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అనుకునే వారు ముందుగా ఆలోచించేది ఏంటి అంటే,డ్రై ఫ్రూట్స్,డ్రై ఫ్రూట్స్ జ్యూస్,డ్రై ఫ్రూడ్స్ లడ్డులు వీటిని ఎక్కువగా తీసుకోవాలి అని ఆలోచిస్తారు.కానీ రోజు మన తినే ఆకుకూరలలో ఒకటైనా గోంగూరని తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది అని మనలో ఎంత మందికి తెలుసు.ప్రత్యేకంగా గోంగూరని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు.గోంగూర పప్పు, గోంగూర పచ్చడి,ఇలా చేసుకోవడం అలవాటు.కొంత మంది నాన్వెజ్ ని కూడా గోంగూర తో చేసుకుని ఆస్వాదిస్తూ ఉంటారు.మటన్ గోంగూట,బోటీ గోంగూర,చికెన్ గోంగూర ఇలా చేసుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు.మరి గోంగూర తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది అని తెలిస్తే ఇక వదలకుండా తింటారు.అయితే ఎప్పుడు ఒకే స్టయిల్ లో కాకుండా కొంచం వెరైటీ గా ఇవాళ గోంగూర పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం.


ముందుగా ఒక గ్లాస్ రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ వేసి అందులో టీ స్పూన్ పచ్చి సెనగ పప్పు,హాఫ్ టీ స్పూన్ పెసరపప్పు,హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి,చిటపటలాడాక అందులోనే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు,నాలుక ఎండుమిర్చి ముక్కలు,గుప్పెడు కరివేపాకు వేసి,హాఫ్ టీ స్పూన్ పసుపు,చిటికెడు ఇంగువ వేసి,అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి.ఇప్పుడు ఇందులోనే రెండు కట్టల ఎర్ర గోంగూరని శుభ్రంగా చేసుకొని వీలైనంత సన్నగా తురుముకొని వేసుకోవాలి.ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి.గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి.ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.ఫైనల్ గా కొన్ని వేరుశెనగ గుళ్ళు వేపుకొని ఇందులో కలిపుకోవాలి.అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర పులిహోర రెడీ.ఐరన్ ఫుల్ గా ఉండే ఈ గోంగూర తో పిల్లలకి తరచూ ఇలా చేసి పెట్టడం వల్ల చాలా మంచిది,మనకు ఎల్లపుడు మార్కెట్ లో మనకి అందుబాటులో ఉండే ఈ గోంగూరతో నిముషాలలో ఈ పులిహోర చేసుకోవచ్చు.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం, మీరు ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: