
మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత చేపలను ఎక్కువగా తినడం ప్రారంభించారు జనాలు. అయితే చేపలల్లో ఉండే గుడ్డును కూడా కొంతమంది ఇష్టంగా తింటూ ఉంటారు . చేపలను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది అంటూ డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు . అయితే చేప గుడ్లు తినడం మంచిదేనా..? చేపలలో ఉండే పోషకాలు కారణంగా చేపలు మనకు ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి అన్న మాట వాస్తవమే . అది అందరికీ తెలుసు . మరి చేప గుడ్లు సంగతి ఏంటి..? చేప గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదా..? చెడ్డదా..? చేప గుడ్లు మన ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూరుస్తాయా ..? ఈ విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
చేపలతో పాటు చేప గుడ్లలల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. చేప గుడ్లల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. ఇది మన అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది . మరీ ముఖ్యంగా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు చేపలను రోజూ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ పొందుతారు. చేప గుడ్లు తింటే గుండె సంబంధిత సమస్యలు కూడా దగ్గరికి రావు అంటున్నారు డాక్టర్లు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఎంతో మంది రోజుకి ప్రాణాలు విడిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా పెరిగిపోతున్న ఫాస్ట్ కల్చర్ కి హై ప్రాసెస్డ్ ఫుడ్ అదే విధంగా ఫాస్ట్ ఫుడ్స్ తిని కొలెస్ట్రాల్ ఎక్కువగా పెంచేసుకుంటున్నారు.
చేప గుడ్లలల్లో కొలెస్ట్రాలను తగ్గించే గొప్ప గుణం కూడా ఉంది. చేప గుడ్లలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటుంది . మన మెదడు పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. చేపప గుడ్డను తింటే మన జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది . చేప గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. చేప గుడ్లను రెగ్యులర్గా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి అంటున్నారు నిపుణులు . మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేప గుడ్లు కాపాడుతాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. చేపలే కాదు చేప గుడ్లు కూడా ఆరోగ్యానికి మంచిదే అంటూ డాక్టర్లు చేప గుడ్లను తినమంటూ సజెస్ట్ చేస్తున్నారు. ఇక చేప గుడ్లలో మెగ్నీషియం .. క్యాల్షియం .. ఫాస్ఫరస్ .. విటమిన్ డి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఎముకలను బాగా దృఢంగా మారుస్తూ బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడతాయి..!!