ఎవరైనా కడుపునొప్పిగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వైద్యం చేసి ఏవో మాత్రలు ఇస్తారు.  కనీసం కడుపునొప్పి టాబ్లెట్ లు ఇవ్వకపోయినా మరొకటి ఇచ్చి పంపుతారు.  ఇంకొంతమంది వైద్యులు కడుపు నొప్పిగా ఉందంటే అవసరం లేకున్నా అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తారు. చిన్న నొప్పిని తగ్గించేందుకు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసిన వ్యక్తులను మనం చూసే ఉన్నాం.  తలనొప్పి వస్తే కాలు నొప్పికి మందు ఇచ్చిన ప్రభుద్ధులను కూడా చూసి ఉన్నాం.  


అయితే, కడుపునొప్పిగా ఉందని వెళ్తే.. కండోమ్ ఇచ్చిన డాక్టర్ ను ఎవరైనా చూశారా.  షాక్ అవ్వకండి..ఇది నిజమే.  ఝార్ఖండ్ లోని ఘాటిశ్లాలో ఈ సంఘటన జరిగింది.  ఈనెల 23 వ తేదీన ఓ మహిళా పాపం తనకు కడుపునొప్పిగా ఉందని ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్ళింది.  అక్కడ డాక్టర్ ఆమెను పరీక్షించి మందుల చీటీ రాసిచ్చారు.  ఆ చీటీ పట్టుకొని మందుల దుకాణానికి వెళ్ళింది.  ఆ మందులషాపు వ్యక్తి చీటీ చూసి షాక్ అయ్యాడు.  


అదేంటీ కడుపునొప్పికి కండోమ్ ఎందుకు అని అడిగాడు.  దీంతో పాపం ఆ మహిళకు ఏం చెప్పాలో అర్ధంకాలేదు.  వెంటనే మహిళ ప్రభుత్వ ఆసుపత్రి అధికారిని కలిసి కంప్లైంట్ చేసింది.  సదరు ఆఫీసర్ ఓ కమిటీని వేసి విచారణ ప్రారంభించింది.  ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.  


ఘాటిశ్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటనతో ఝార్ఖండ్ శాసనసభ దద్దరిల్లిపోయింది.  శాసన సభలో దీనిపై పెద్ద చర్చను జరిపారు.  వైద్యునిపై తగిన చర్యలు తీసుకోవాలని అంటూ పట్టుబట్టారు.  ఒక చిన్న చీటీ ఇంతటి ప్రభావం చూపిస్తుందని అసలు ఊహించలేదు ఆ డాక్టర్.  మరి దీనిపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  అసలు ఈ విషయం గురించి పట్టించుకుంటుందా లేదంటే.. అక్కడి హాస్పిటల్ అధికారికే అప్పగిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: