ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలను పట్టించుకునేంత టైం ఉండటం లేదు. ఇక తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలను కొన్ని విషయాలలో తోటి వారితో పోల్చడం మంచిదే. కానీ అన్ని విషయాలలో కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అదేపనిగా పిల్లల్ని తోటి వారితో పోల్చి, వారిని మానసికం గా ఒత్తిడికి గురిచేస్తే అనుకున్న మార్పు రాకపోగా సమస్య మీరింత పెరిగిపోతుంది.