ఇక డైపర్ వేసేముందు పౌడర్ రాయినట్లు అయితే, ఒక బట్ట తో తడిని తుడిచి వేసి బేబి క్రీం రాయడం వల్ల ర్యాషెస్ ఏర్పడవు. పౌడర్ కి బదులుగా బేబి క్రీం రాయవచ్చు. ర్యాషెస్ వచ్చిన చోట ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె తీసుకొని నెమ్మదిగా రాయండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ర్యాషెస్ తగ్గిపోతాయి. చాలా ఎక్కువ సేపు ఒకే డైపర్ ని బేబీకి వేయరాదని గుర్తుంచుకోండి. ఒకవేళ అది పూర్తీగా ఉపయోగించకపోయినా.. రెండు గంటలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాలి.
అయితే మీరు నూనెకు బదులుగా అలోవెరా జెల్ తో కూడా మసాజ్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఇబ్బంది కూడా ఉండదు. డైపర్‌లను తరచుగా మార్చండి. తడి లేదా మురికి డైపర్‌లను వెంటనే తొలగించండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినా సరే ర్యాషెస్ తగ్గలేదు అంటే డాక్టర్ని సంప్రదించడం ఎంతో అవసరం. రోజులో కొన్ని గంటల పాటు డైపర్ లేకుండా బేబీ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సున్నితమైన వాళ్ల చర్మానికి కాస్త గాలి అవసరం. రోజంతా డైపర్లతో ఉంచితే.. రాషెష్ రావడం ఖాయం.
రెగ్యులర్ గా స్నానం చేయించడం చాలా అవసరం. 5 నెలలు నిండిన పిల్లలకు రెగ్యులర్ గా స్నానం చేయించడం వల్ల.. ర్యాషెష్ నివారించవచ్చు. స్నానం చేయించిన వెంటనే సున్నితంగా చర్మాన్నంతటినీ శుభ్రం చేయాలి. తడి లేకుండా తుడవాలి. టవల్ తో ఎక్కువగా రుద్దడం వల్ల చర్మంపై దురద, ర్యాషెష్ కి కారణమవుతుంది. శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్ లను డైపర్లకు బదులుగా ఉపయోగించాలి. ఇవి బేబీ యూరిన్ ని పీల్చుకుంటాయి. డైపర్స్ కంటే కాటన్ క్లాత్స్ చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి