ఎంత టిప్ టాప్ గా రెడీ అయినా.. చక్కని పాదరక్షలు వేసుకోకపోతే ఎవరూ కూడా అందంగా కనిపించరు. పాదరక్షలు మన పాదాలను ముళ్ళు, రాళ్లు, మురికి నుంచి కాపాడటమే కాదు అందాన్ని కూడా తెచ్చి పెడతాయి. అయితే మానవులు ధరించే వాటిలో అత్యంత ముఖ్యమైన పాదరక్షల గురించి 3 ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


1. స్నీకర్లలో స్నీకింగ్.

స్నీకింగ్ అంటే నక్కుట.. రహస్యంగా ప్రవేశించుట.. ఇతరుల కళ్లుగప్పి దొంగతనంగా వెళ్ళిపోవుట.. ఎవరికీ తెలియకుండా సంచరించుట.. ఇలా అనేక అర్ధాలు వస్తాయి. అయితే ఈ అర్ధాలన్నిటికీ సంపూర్ణంగా సరిపోయేలా స్నీకింగ్ స్నీకర్స్ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించగలిగారు అడ్వర్టైజింగ్ ఏజెంట్ హెన్రీ నెల్సన్ మెకిన్నే. అప్పట్లో హెన్రీ నెల్సన్ ఎలాంటి చప్పుడు చేయని స్నీకర్స్ రబ్బర్ తో తయారు చేసి.. " ఈ స్నీకర్లతో ఎవరికీ తెలియకుండా సంచరించండి" అని మార్కెటింగ్ చేయడంతో సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి రాకముందు శబ్దం చేసే చెక్క చెప్పులతో ప్రజలు సరి పెట్టుకునేవారు. కానీ ఎప్పుడైతే రబ్బర్ స్నీకర్స్ వచ్చాయో.. అప్పటి నుంచి వాటిని కొనుగోలు చేయడానికే ప్రజలు ఆసక్తి చూపడం ప్రారంభించారు.

2. బార్లీ గింజలతో షూ పరిమాణాల కొలత మొదలయ్యింది.

రోమన్ నాగరికత సమయంలో బార్లీ గింజలతో షూ సైజులను కొలిచేవారట. 3 బార్లీ గింజల పొడవు ఒక అంగుళంతో సమానం అని అప్పటి ప్రజలు భావించేవారట. అయితే ఈ కొలతను రోమన్ ప్రజలు కనిపెట్టలేదని.. మొదటగా బ్రిటిషర్లే ఈ పద్ధతిని ఉపయోగించి ప్రజల షూస్ కొలిసేవారని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. కింగ్ ఎడ్వర్డ్ II పాలనలో, 1324 లో జారీచేసిన రాజ ఉత్తర్వులలో పాదరక్షల ఉత్పత్తిలో బార్లీ గింజలు అధికారిక కొలత ప్రమాణమని పేర్కొనబడిందట. బార్లీ గింజలు ఇప్పటికీ యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్‌ లలో అధికారిక కొలత యూనిట్ గా పరిగణిస్తారని తెలుస్తోంది.

3. హై హీల్స్ మొదటగా వేసుకుంది మగవారే.

పొట్టిగా ఉన్న అమ్మాయిలు, స్టైలిష్‌గా కనిపించాలని భావించే అమ్మాయిలు హైహీల్స్‌ ధరించడం మనం తరచుగా గమనిస్తూనే ఉంటాం. ఈ హైహీల్స్‌ కేవలం ఆడవారి కోసమే తయారు చేస్తారనే భావన చాలా మందిలో ఉంది. కానీ వాస్తవమేమిటంటే, ఈ హైహీల్స్‌ ఒకప్పుడు మగవాళ్లు మాత్రమే వేసుకునేవారట. ఈ హైహీల్స్‌ వేసుకోవడం ప్రారంభించింది మగవారేనట. హై హీల్స్‌ వేసుకోవడం పదో శతాబ్దం నుంచే ప్రారంభించారని చరిత్రకారులు అంటుంటారు. అప్పట్లో పర్షియాకు చెందిన సైనికులు గుర్రాలపై స్వారీ చేసేటప్పుడు.. ప్రత్యేకంగా తయారు చేసిన షూస్ వేసుకునేవారు. ఈ ప్రత్యేకమైన షూస్ చివరి భాగం వద్ద అదనంగా కొన్ని అంగుళాలు ఎత్తు ఉండేది. సైనికులు ఈ ఎత్తయిన షూ మడమని గుర్రంపైకి ఎక్కినప్పుడు పెడెల్‌ లో ఉంచేవారు. దీనివల్ల వారి కాళ్ళు స్థిరంగా ఉండేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: