మహిళలు మగవారికంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిత్యం పనులతో బిజీ బిజీ లైఫ్ స్టైల్ గడుపుతూ ఆరోగ్యానికి సమయాన్ని వీరు కేటాయించలేక పోతున్నారు. ఫలితంగా మగవారి కంటే ఆడవారు త్వరగా జబ్బుల బారిన పడుతున్నారు అని ఒక సర్వేలో వెల్లడి చేయడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా ఈ కారణాల వల్ల చాలా మంది మహిళలు త్వరగా కరోనా బారిన పడుతున్నారట. అయితే ఈ కరోనా వేళ మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు తీసుకోవాల్సిన కొన్ని ఆహారనియమాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా మహిళలు తమ రోజువారి డైట్ లో తీసుకోవాల్సిన మినరల్స్, విటమిన్స్ ఏంటో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

విటమిన్ సి:
విటమిన్ డి లా కాకుండా విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్..కాబట్టి ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఫ్రీ రాడికల్ , ఇన్ఫెక్షన్స్, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. కరోనా నుంచి కాపాడి రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలను దూరం చేయడంలో విటమిన్ సి చాలా అవసరం. బ్రోకలీ , ఎరుపు, ఆకుపచ్చ మిరియాలు, సిట్రస్ పండ్లు, కివి ఫ్రూట్  వంటివి ఎక్కువగా తినాలి.


ఫోలేట్:
అంటే విటమిన్ బి అని అర్థం. విటమిన్ బి మనకు ఆకుపచ్చ ఆకుకూరలు, పండ్ల నుండి లభిస్తుంది. ఎర్ర రక్త కణాల తో పాటు dna తయారు చేయడంలో విటమిన్-బి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఫోలేట్ ఒక ముఖ్యమైన పోషకం.

విటమిన్ డి:
విటమిన్-డి అనేది ఎక్కువగా కొవ్వులో కరిగే విటమిన్.. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మనకు సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహించి.. కండరాల కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. మనకు సూర్యరశ్మి తో పాటు విటమిన్ డి అధికంగా లభించే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో కాకుండా మన శరీరానికి ఎంత అవసరమో వైద్యుడిని సంప్రదించి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.

వీటితో పాటు మహిళలు తప్పకుండా తీసుకోవాల్సినవి.. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్, విటమిన్స్ తమ రోజూ వారీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: