పెళ్లి అనేది జీవితంలో ఒక మధురమైన ఘట్టం. ఎందుకంటే వచ్చే వారిపైనే పూర్తిగా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వచ్చే వారు మన జీవితాన్నే మార్చేయలరు. గతంలో ఉన్న జీవితం ఒక ఎత్తు అయితే పెళ్లి తరవాత ఆ వైవాహిక జీవితం మరో ఎత్తు. అలాంటి ఒక అద్భుతమైన ఆరంభానికి ఆది పెళ్లి చూపులే. ఈ రోజుల్లో అయితే ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి, నిజానికి ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ అలా పెద్దల మాట విని వారు ఎంపిక చేసిన వారిని పెళ్లి చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లికి పెళ్లి చూపులు అనేవి కామన్. పెళ్లి చూపులకు వెళ్ళడం ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ఒకరికి ఒకరు నచ్చితే ఆ తరువాత ఇరు కుటుంబ సభ్యులు మిగిలిన విషయాలను మాట్లాడుకుని పెళ్లి చేయడం జరుగుతాయి.

అయితే పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఎలా తన జీవితానికి కరెక్టా కాదా అన్నది తెలుసుకోవాలి అన్న విషయం గురించి ఈ విషయాలు తెలుసుకోండి.  పెళ్లి కూతురు కేవలం అందంగా ఉంటే చాలు అని కళ్ళకు నచ్చితే చాలు ఇక పెళ్లి ఫిక్స్ అనుకుంటే పొరపాటే... స్త్రీ అందాన్ని చూసి తనతోనే జీవితం అని వివాహం నిశ్చయించుకోవడం పెద్ద పొరపాటే కావచ్చు అంటున్నారు. 100 ఏళ్ల వైవాహిక జీవితానికి... బాహ్య సౌందర్యం కంటే ఆమె సుగుణాలు చాలా  ప్రదానం. అందం కంటే స్త్రీకి సంస్కృతి, విద్య ఉన్నతిని చేకూరుస్తాయి. అవే జీవితంలో ఎలా మెలగాలి, ఎలా జీవితం లోని మంచి చెడులను హ్యాండిల్ చెయ్యాలి అన్న జ్ఞానాన్ని అందిస్తాయి.

అలాగే పెళ్లి గురించి తెలుస్తున్న వివరాల ప్రకారం పురుషుడితో పాటు స్త్రీకి కూడా మతపరమైన ఆచారాలపై పూర్తి విశ్వాసం ఉండాలి. పెళ్లి చూపులకు అమ్మాయిని చూసేందుకు అబ్బాయి వెళ్ళినపుడు, ఆ పెళ్లి కూతురు మతపరమైన నమ్మకాలను కలిగి వుందో లేదో అన్న విషయాన్ని గ్రహించాలి. అలాగే ఆమె గుణగణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అపుడే ఆమె మీ జీవితానికి సరిపోతుందా లేదా అన్నది ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతే కానీ పైకి కనిపించే అందాలకు లోను కాకూడదు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: