
ఫేస్ వాష్ తరుచూ వాడటం వల్ల,చర్మంపై గల మురికిని , మలినాలను మరియు అధికంగా ఊత్పత్తి అయిన నూనెలను తొలగించి,చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.తక్కువ ఖర్చుకే లభిస్తుందని చాలామంది ముఖం శుభ్రం చేసుకోవడానికి సబ్బును ఉపయోగిస్తుంటారు.కానీ, సబ్బుతో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల,ముఖముపై గల చర్మం రంధ్రాలు మూసుకుపోతాయి.దీనితో శరీరంలోపల గల వేస్ట్ బయటకు రాకుండా మొటిమల వచ్చేందుకు దోహదపడుతుంది.అంతే కాక సబ్బు చర్మం కల అధికంగా వున్న నూనెలను మురికి,అనేక రకాల సూక్ష్మక్రిములను పూర్తిగా శుభ్రం చేయదు.దానితో ముఖంపై బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్,మొటిమలు వంటి చర్మ సమస్యలు కలుగుతాయి.
మరియు సబ్బులలో ఉపయోగించే కఠినమైన రసయనాలు మన ముఖముపై వున్న ఆసిడ్స్ ph స్థాయి ని దెబ్బతిస్తుంది.ఇది మన చర్మాన్ని నిర్జీవంగా, పొడిబారినట్టుచేసి,ముడతలు పడేలా చేస్తుంది.మరియు చిన్న వయసులో తొందరగా వృద్యాప్య ఛాయలు మొదలవుతాయి. కొన్ని రకాల సబ్బులలో సువాసన కోసం కలిపిన రసాయనాలు, ముఖముపై గల చర్మానికి దురదలు కలిగిస్తాయి.కావున అలాంటి సోప్ లు వాడకపోవడమే చాలా మంచిది.ఒక వేళ సబ్బులు వాడాలి అనుకుంటే అలోవెరా,మేరిగోల్డ్, గ్రీన్ టీ సబ్బులు చాలా బాగా ఉపయోగపడతాయి.