
జీర్ణ సమస్యలు పోగొట్టుకోవడానికి..
ఉదయపు టిఫిన్ కి బదులుగా రాగి జావ,రాగి దోశ, రాగి ఇడ్లీ లాంటి వాటిని తినాలి.ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.అందువల్ల జీర్ణ కోశం ఆరోగ్యకరంగా ఉంటుంది.వీటిలో ఉండే అధిక సాల్యుబుల్ ఫైబర్ శరీరంలో నుంచి వ్యర్థాలను బయటకు తోసి వేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.
మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడానికి..
చల్లగా ఉండే ఈ సీజన్ వల్ల మెటబాలిజం తక్కువగా ఉంటుంది.దానితో కేలరీలు ఎక్కువగా బర్న్ కావు.వాటి ఫలితంగా అదనంగా ఉన్న కొవ్వులు మన శరీరంలో జమ అవుతాయి.దీనితో బరువు పెరగడం,మధుమేహం రావడం లాంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయి.రాగులు తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి.మరియు ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు ఉంటాయి.ఇవి పీచు పదార్థంతో కలిసి ఉండటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
ఎముకలు,కండరాల బలానికి..
సాధారణంగా చలికాలంలో ఎక్కువగా మోకాళ్ల నొప్పులు,కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.దానికి కారణం క్యాల్షియం లెవెల్స్ తక్కువగా ఉండడమే.రోజూ ఏదో ఒక రూపంలో రాగి పిండిని మనం తీసుకోవడంతో ఇందులో పుష్కలంగా లభించే కాల్షియంతో వీటన్నిటిని పోగొట్టుకోవచ్చు.
బరువు తగ్గేందుకు..
ఈ సీజన్లో మన శరీరం క్యాలరీలు ఖర్చును తగ్గిస్తుంది కనుక అధిక ఫైబర్ ఉన్న రాగులను తీసుకోవడం వల్ల బరువును కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.మరియు మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను కూడా పారద్రోలడంలో రాగులు చాలా బాగా పనిచేస్తాయి. కావున చలికాలంలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా ఉత్తమం.