పక్షవాతం నరకం లాంటిది. ఆ సమస్యతో పోరాడటం కంటే చనిపోవడం చాలా మేలు. ఇక ఆ సమస్య వచ్చే ముందే పసిగట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా నష్టం తగ్గుతుంది. కొన్ని లక్షణాల ద్వారా పక్షవాత ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.మీకు నిత్యం బలహీనంగా అనిపిస్తున్నా, అకస్మాత్తుగా కాళ్లు, లేదా చేతులు తిమ్మిరిపట్టినట్లు అనిపించినా వెంటనే అలర్ట్‌ కావాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఒక కాలు లేదా ఒక చేయి ఒకవైపే లాగుతున్నట్లు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని కూడా పక్షవాతానికి ముందస్తు లక్షణంగా భావించాలి.ఇంకా కొన్ని సందర్భాల్లో ముఖం కూడా ఒక వైపు లాగినట్లు ఉంటుంది. మరీ ముఖ్యంగా నవ్వుతున్న సమయంలో ఇలాంటి భావన కలిగితే వెంటనే వైద్యులను సంప్రందిచాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే మాటలు అస్పష్టంగా ఉన్నా, మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు.


వారు ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.అలాగే ఆకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వస్తే రక్తస్రావం జరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. తలలో తీవ్రైన తలనొప్పి వచ్చి మెదడులో రక్తస్రావం జరుగుతుండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చూపు అస్పష్టంగా ఉన్నా కూడా ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.అలాగే ఎదుట ఉన్న వస్తువులు ఒకటి రెండుగా కనిపించడం, మైకం కమ్మినట్లు అవుతుంది. తల తిరగడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఉండకపోయినా.. స్ట్రోక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలుగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఒకవేళ స్ట్రోక్‌ కనుక వచ్చిన వెంటనే.. వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రమాద తీవ్రతను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.అప్పుడు మెదడులోని న్యూరాన్లు నశించడం మొదలవుతాయి. సిగరెట్ తాగేవారు, మధుమేహం, అధిక రక్తపోటు ఇంకా అధిక ఒత్తిడి ఉన్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ లక్షణాలని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: