
వేసవికాలంలో శరీరం హైడ్రాయిడ్ గా ఉండడం వల్ల చాలా అవసరం. అందుకోసం కొన్ని రకాల పండ్లు రోజు తినాలి. పుచ్చకాయలో 91 శాతం నీరు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది లో కేలరీ ఫ్రూట్. అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. కర్బూజా లో 90 శాతం వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఫైబర్ కూడా లభిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. విటమిన్ సి రిచ్ ఫుడ్ పైనాపిల్ లో 86 శాతం నీరు ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు కణాలు దెబ్బ తినకుండా నిరోధిస్తుంది. మామిడిలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
పనస పండు తిన్నారా ఇందులో 76 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది బి కాంప్లెక్స్ విటమిన్ రిచ్ పండు. జామకాయలో 80 శాతం నీటితోపాటు క్యాల్షియం మెగ్నీషియం పొటాషియం ఉంటాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సహజ ఎలక్ట్రోలైట్ గా పని చేసి శరీరాన్ని తేమతో నింపుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా వేడి వల్ల వచ్చే నీరసం, అలసట వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.