
1. ఉదయాన్నే లేవకపోవడం:
చాలామందికి ఉదయాన్నే లేవడం అలవాటు ఉండదు. రాత్రంతా ఫోన్లు, టీవీలు చూసి, అర్థరాత్రి అయ్యాక పడుకోవడం, ఉదయం సూర్యుడు నెత్తి మీదకి వచ్చే వరకు నిద్రపోవడం చేస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లాక పిల్లలు ఇలా ఎక్కువగా ఉంటారు. అయితే తల్లిదండ్రులు మాత్రమే కాదు, పిల్లలు కూడా ఉదయాన్నే లేవడం చాలా మంచిది. తెల్లవారుజామున లేచి ఇల్లు శుభ్రంగా ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉండవు. అంతేకాదు, లక్ష్మీదేవి ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడే ఉంటుంది. అలాంటి వారికి అప్పు బాధలు కూడా ఉండవు.
2. భోజనాన్ని అవమానించడం:
కొంతమంది భోజనం దగ్గర చాలా నస పెట్టే ప్రవర్తన చేస్తారు. ఇంట్లో ఎంతో ప్రేమతో చేసిన ఆహారం నచ్చకపోతే, "ఛీ!" అంటూ అపశకునంగా మాట్లాడుతారు. తినేటప్పుడు ఏడవడం, పళ్లెంలో వడ్డించుకున్నా వదిలేయడం, అన్నాన్ని అగౌరవపరచడం చేస్తారు. అలా చేస్తే లక్ష్మీదేవి అసలు ఆ ఇంట్లో ఉండదు. చివరికి ఆ ఇల్లు పేదరికంతో అల్లాడిపోతుంది.
3. చెడు అలవాట్లు:
ఇంట్లో సంపద, ఆనందం నశించిపోవడానికి మరో ముఖ్య కారణం తప్పుడు మాటలు, చెడు అనుబంధాలు. ఎవరైనా మద్యం లేదా మాదకద్రవ్యాలకు బానిస అయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. తాగిన మత్తులో కుటుంబ సభ్యులను తిట్టడం, అవమానించడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఒక్క నిమిషం కూడా ఆమె ఆ ఇంట్లో ఉండదు.
4. ఇంటిని, దేవుడి గదిని అశుభ్రంగా ఉంచడం:
కొంతమంది ఇల్లును శుభ్రంగా పెట్టుకోరు. ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే పెట్టేస్తారు. గుమ్మం దగ్గర చెప్పులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. అలాంటి ఇల్లు ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఇల్లు శుభ్రంగా ఉండాలి, ముఖ్యంగా పూజా గది ఎప్పుడూ మరింత శుభ్రంగా ఉండాలి.
5. సంతోషకర వాతావరణం లేకపోవడం:
ఇంట్లో కోట్లు విలువ చేసే వస్తువులు లేకపోయినా పర్వాలేదు. అంతకంటే విలువైనవి కుటుంబ సభ్యుల నవ్వులు. ఎప్పుడూ సంతోషంగా, హర్షధ్వనులతో ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంచితే ఆ ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు శాశ్వతంగా వర్ధిల్లుతాయి.