దీపావళి అంటే వెలుగులు, సంతోషాల పండుగ. హిందూ సంప్రదాయంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవిని పూజించి, ఆమె అనుగ్రహం పొందడానికి ఈ రోజు ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. అయితే, దీపావళి రోజున కొన్ని తప్పులు చేయకుండా ఉండటం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని, శుభాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోనే నివసిస్తుందని నమ్మకం. అందుకే దీపావళికి ముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవడం ఆనవాయితీ. పండుగ రోజున ఇల్లు అపరిశుభ్రంగా ఉంచడం, ముఖ్యంగా ఇంటి మధ్య భాగంలో (బ్రహ్మ స్థానంలో) చెత్త, పనికిరాని వస్తువులు ఉంచడం అశుభమని భావిస్తారు. దీపావళి రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం లేదా ఇతరులకు బహుమతిగా ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతారు. నలుపు అశాంతిని, నిరాశను సూచిస్తుంది.

దీపాలను ఒకే వత్తితో కాకుండా, రెండు లేదా మూడు వత్తులతో వెలిగించడం శ్రేయస్కరం. దీపాలను ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తేనే పవిత్రత ఉంటుందని, ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదని అంటారు. దీపాలను మట్టి ప్రమిదల్లో వెలిగించడం మంచిదని, వెండి లేదా ఇతర లోహపు ప్రమిదలను వాడటం కంటే మట్టి ప్రమిదలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతారు.

దీపావళి రోజున లక్ష్మీదేవి స్వాగతం కోసం వేసే ముగ్గుల్లో పొరపాటున కూడా నలుపు రంగు లేదా ముదురు గోధుమ రంగు వాడకూడదని సూచిస్తారు. బియ్యపు పిండితో ముగ్గులు వేయడం మంచిది. లక్ష్మీ పూజ చేసిన వెంటనే పూజ స్థలాన్ని లేదా విగ్రహాలను తొలగించడం, శుభ్రం చేయడం చేయకూడదు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంట్లో నిలవాలంటే, ఆచారాలు పూర్తయ్యే వరకు ఆ స్థానాన్ని అలాగే ఉంచాలి.  పండుగ రోజు ఇతరులను తిట్టడం, గొడవలు పెట్టుకోవడం, మనసులో కోపాన్ని, అసూయను పెంచుకోవడం చేయకూడదు. ఈ రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకుని, లక్ష్మీదేవిపై లగ్నం చేయడం ఉత్తమం. బంధుమిత్రులకు బహుమతులు ఇచ్చేటప్పుడు పొరపాటున కూడా లెదర్ (తోలు) వస్తువులను ఇవ్వకూడదని, ఇది ధన నష్టాన్ని కలిగిస్తుందని కొందరు విశ్వసిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: