
గత ఎన్నికల్లో జగన్ గాలిలో చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచేశారు. కేవలం జగన్ బొమ్మ చూసి ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలని భారీ మెజారిటీలతో గెలిపించేశారు. ఇందులో ప్రజలకు పెద్దగా తెలియని నేతలు కూడా వైసీపీ తరుపున తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారిలో సిద్ధారెడ్డి కూడా ఒకరు.
కదిరి నియోజకవర్గం నుంచి సిద్ధారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మామూలుగా కదిరి టిడిపికి కంచుకోట. అలాంటి కంచుకోటలో భారీ మెజారిటీతో సిద్ధారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా భారీ మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణం జగన్ ఇమేజ్. అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన సిద్ధారెడ్డి...జగన్ ఇమేజ్ నిలబెట్టేలా పనిచేస్తున్నారా? అంటే అబ్బే కష్టమే అని రాజకీయ విశ్లేషకుల నుంచి సమాధానం వస్తుంది. ఏదో జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి గానీ, అవి తప్ప ఎమ్మెల్యేకు ఇంకా ప్లస్ ఏది లేదని అంటున్నారు. అభివృద్ధి డల్...వైసీపీ నేతల ఆదాయం ఫుల్ అనే విధంగా పరిస్తితి ఉందని అంటున్నారు. అక్రమాలు, దందాలు బాగా ఎక్కువగా ఉన్నాయని, సొంత పార్టీ నేతలకే పెద్ద పీఠ వేసుకుంటూ ఎమ్మెల్యే ముందుకెళుతున్నారని, ఎన్నికల ముందు కదిరి ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయడంలో సక్సెస్ కాలేదని అంటున్నారు.
ఇక అధికారంలో ఉన్నారు కాబట్టి స్థానిక ఎన్నికల్లో కదిరిలో వైసీపీకే ప్రజలు పట్టం కట్టారు గానీ, సాధారణ ఎన్నికలోచ్చేసరికి పరిస్తితి అలా ఉండదని అంటున్నారు. ఇక్కడ టిడిపి నేత కందికుంట వెంకటప్రసాద్ ఫుల్ గా పుంజుకున్నారు. కాబట్టి సిద్ధారెడ్డి సెకండ్ ఛాన్స్ కోల్పోవచ్చని తెలుస్తోంది.