టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తాను తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ పై గట్టిగా దృష్టి పెట్టినట్లు సమాచారం. దాదాపుగా మూడేళ్ళ క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా రెండు రోజుల క్రితం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తొలిసారిగా స్టార్ నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా యాక్ట్ చేస్తున్నారు. హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కి జోడీగా, అలానే బాలీవుడ్ భామ అలియా భట్ చరణ్ కి జోడీగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీని ఎలాగైనా పెద్ద సక్సెస్ చేయాలని ప్రతి విషయమై రాజమౌళి ఎంతో శ్రధ్ద తీసుకున్నారట.

డివివి దానయ్య ఎంతో భారీగా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకి కేకే సెంథిల్ కుమార్ కెమెరా మ్యాన్ గా వర్క్ చేస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన దోస్తీ సాంగ్ యూట్యూబ్ లో విడుదలై అందరి నుండి మంచి స్పందన దక్కించుకుంది. ఇక సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన యూనిట్ త్వరలో మరొక లేటెస్ట్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మరికొంత పెండింగ్ ఉందని, అది పూర్తి కావడానికి మరింత టైం పెట్టె అవకాశం ఉండడంతో సినిమాని మరొక్కసారి వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారట యూనిట్.

అయితే రాబోయే క్రిస్మస్ కి ఇప్పటికే పుష్ప విడుదల డేట్ అనౌన్స్ చేయగా, ఆపై సంక్రాంతికి మహేష్ సర్కారు వారి పాట, పవన్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు కూడా తమ విడుదల తేదీలని ప్రకటించాయి. దానితో కొంత ఆలోచనలో పడ్డ రాజమౌళి సమ్మర్ లో ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేయాలని భావించారట. అయితే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల సలహాతో సంక్రాంతికి వద్దాం అనే ఆలోచనలో ఆయన ఉన్నారని, ఈ విషయమై ఇప్పటికే మహేష్, పవన్, ప్రభాస్ ల సినిమాల యూనిట్స్ ని సంప్రదించి వారిని ఒప్పించినట్లు చెప్తున్నారు. ఈ విధంగా అసలు ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ పై పలు కథనాలు ప్రచారం అవుతుండడంతో, అసలు ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుంది అనే దానిపై అందరిలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. జక్కన్నా రిలీజ్ డేట్ పై ఏదో ఒకటి తేల్చన్న అంటూ పలువురు ప్రేక్షకాభిమానులు దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజమౌళి ఈ విషయమై ఏమి చేస్తారో చూడాలి .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: