
ఇక ఈ సినిమాలో తమన్నా డ్యాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ట్రైలర్ మొత్తం చూసినా ఆ సాంగ్ గురించి ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు. సాధారణంగా ఇలాంటి మాస్ అట్రాక్షన్ మూవీస్ లో ఐటమ్ సాంగ్ ను ఎక్కడో ఒక చోట టక్కున చూపిస్తారు, కనీసం ఓ చిన్న గ్లింప్స్ అయినా ఇస్తారు. కానీ మారుతి మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యాడు. అంతా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సస్పెన్స్ ను ఉంచాడని అందరూ మాట్లాడుకుంటున్నారు.
అభిమానులు కూడా “మారుతి మైండ్ బ్లోయింగ్.. ట్రైలర్ లో ప్రభాస్ ను మాత్రమే హైలైట్ చేసి మిగతా అంశాలను పూర్తిగా సస్పెన్స్ లో వదిలేశాడు. ఈ ఐడియా వల్ల సినిమాపై మరింత ఎగ్జైట్మెంట్ పెరిగింది” అని ఆనందపడుతున్నారు. రాజా సాబ్ ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం ప్రభాస్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగానే వర్కౌట్ అయింది. ఆయన స్టైల్, కామెడీ టైమింగ్, రొమాంటిక్ యాంగిల్—అన్నీ ప్యాకేజీగా కనిపించడం ఫ్యాన్స్ కి మైండ్ బ్లాస్టింగ్ అనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ ద్వారా మారుతి తన తెలివితేటలను మరోసారి రుజువు చేశాడు. ఎలాంటి హైప్ అవసరం లేకుండా, కేవలం కంటెంట్ తోనే అటెన్షన్ గ్రాబ్ చేయడం చాలా తక్కువ మందికి సాధ్యం అవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి జనవరి 9వ తేదీపై ఉంది. ఆ రోజు రాజా సాబ్ థియేటర్లలో విడుదల అవుతుంది. తర్వాత ఈ సినిమా మారుతి కి ఎంత పేరు, ప్రభాస్ కి ఎంత క్రేజ్ తీసుకురాబోతుందో చూడాలి..??