యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై, హీరో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జోడిగా నటించిన చిత్రం టాక్సీ వాలా. ఈ సినిమాకి నిర్మాతగా రాహుల్ వహించాడుఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కళ్యాణి, యమున వంటి వారు నటించారు. ఈ సినిమా 2018 లో నవంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

టాక్సీ వాలా సినిమా విడుదలై నిన్నటికి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సినిమా విడుదల అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు డైరెక్టర్ నిర్మాతలు. ముఖ్యంగా ఈ సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడడం,  చిత్ర యూనిట్ సభ్యులను చాలా బాధ కలిగించింది. అంతేకాకుండా ఈ సినిమాకి డైరెక్టర్ కొత్త దర్శకుడు కావడంతో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

దీంతో నిర్మాతలు చేసేదేమీ లేక కొన్ని చోట్ల వారే స్వయంగా విడుదల చేసుకున్నారు. కానీ ఈ సినిమా అనుకోని విధంగా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. వాస్తవానికి ఈ టాక్సీ వాలా సినిమా మరొక యంగ్ హీరో చేయవలసి ఉండేది. అతను ఈ కథ ని రిజక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది. ఇక ఈ సినిమా వదులుకున్న హీరో ఎవరో కాదు హీరో రాజ్ తరుణ్.

ఈ కథను డైరెక్టర్ రాహుల్ హీరో రాజ్ తరుణ్ తో తీయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, ఈ కథ వద్దని రాజ్ తరుణ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న నటుడు రాజారవీంద్ర, ఈ సినిమా చేయడం చాలా పెద్ద రిస్క్ అనడంతో రాజ్ తరుణ్ వెనకడుగు వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తాను స్వయంగా ఒక ప్రముఖ ఛానల్లో తెలియజేశాడు రాజా రవీంద్ర. ఈ సినిమా విజయ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మార్పులు జరిగాయని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: