కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ రీసెంట్ గా హర్ట్ అటాక్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లోని జింలో వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ పునీత్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్స్ చికిత్స అందిస్తున్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇలా పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన అభిమానులు శోకశంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పునీత్ మరణించి దాదాపు 22 రోజులు కావస్తున్న ఆయన అభిమానులు పునీత్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

 కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పునీత్ తన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో  ప్రేక్షకులను అలరించారు. సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అనతికాలంలోనే  కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ ట్యాగ్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాదు కన్నడలో టాప్ స్టార్లలో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఒకడుగా ఉన్నాడు. ఇంత స్టార్‌డం పునీత్ రాజ్‌కుమార్‌ కు ఊరికే రాలేదు. తండ్రి పేరు చెప్పుకుని సినిమాలోకి వచ్చినా..ఆయన ఎంతో కష్టపడి సినీ ఇండస్ట్రీలో ఈ స్దాయికి వచ్చారు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పునీత్ రాజ్ కుమార్ ని  హీరోగా పరిచయం చేసింది మన తెలుగు దర్శకుడే. అంతేకాదు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంతకు పునీత్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఇంకెవరు టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా  "అప్పు" అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ ను షేక్ చేసింది.  నిజానికి 2001లో పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్‌తో పూరి జగన్నాథ్ తెలుగులో తమ్ముడు అనే సినిమాని కన్నడలో యువరాజాగా రీమేక్ చేసాడు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. దీంతో రాజ్‌కుమార్ పిలిచి మరీ పునీత్‌ను లాంచ్ చేసే అవకాశం పూరి జగన్నాథ్ కు ఇచ్చారు.ఇలా  పునీత్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఆయన సినీ కెరీర్ పరుగులు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: