జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన దొరసాని సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్  విజయాన్ని సాధించినప్పటికీ ఈ సినిమాలో దొరసాని పాత్రలో శివాత్మిక రాజశేఖర్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది. ఇలా మొదటి సినిమా లోనే ఒక మంచి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మన సు దోచుకున్న ఈ ముద్దు గుమ్మకు ఆ తర్వాత వరుస పెట్టి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు తగ్గుతాయి అని చాలా మంది భావించారు, కాకపోతే ఈ ముద్దు గుమ్మ  మొదటి సినిమా విడుదల అయ్యి చాలా కాలం అవుతున్న ఇప్పటి వరకు తన రెండవ సినిమా ను మాత్రం విడుదల చేయలేక పోయింది, తెలుగు లో ఈ ముద్దు గుమ్మ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయిన  ఇతర భాషల్లో మాత్రం పలు ప్రాజెక్టు లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. 
ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్, కృష్ణవంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రంగ మార్తాండ అనే సినిమా లో ముఖ్య పాత్ర లో నటిస్తుంది, ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా అంతే అటు గా ఉంటూ అనేక విషయాలను తన అభిమాను లతో పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పు డప్పుడు తన ఫోటో లను కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ముద్దు గుమ్మ చీర కట్టు లో అదిరి పోయే లుక్ లో దిగిన ఫోటోలు కొన్ని ఇప్పటికి నెట్టింట్లో తెగ అవుతున్నాయి, ఇలా శివాత్మిక తన చీరకట్టు అందం తో ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: