టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ హీరోలలో ఒకరు ఆయన సుమన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  హీరో సుమన్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.  టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమన్,  సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన శివాజీ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

 ఈ సినిమా బాక్స్ ఆఫీసీ దగ్గర మంచి విజయం సాధించడం తో సుమన్ కు శివాజీ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి విజయాన్ని సాధించింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా సుమన్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే తాజా ఇంటర్వ్యూ లో సుమన్ మాట్లాడుతూ... కమల్ హాసన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. కమల్ హాసన్ గారు అంటే నాకు ఇష్టమైనప్పటికీ డాన్స్ విషయం లో మాత్రం చిరంజీవి డాన్స్ అంటే నాకు నచ్చుతుంది.  నేలను చూడకుండా చిరంజీవి డాన్స్ చేస్తాడు.

చిరంజీవి డాన్స్ చేసేటప్పుడు బాడీ లో ఒక  గ్రేస్ ఉంటుంది , ఒక రిథమ్ ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది కుర్రవాళ్ళు అంత కంటే చాలా స్పీడ్ గా డ్యాన్స్ చేస్తున్నారు. కాకపోతే ఆ డ్యాన్స్ లో జిమ్నాస్టిక్ శాతం ఎక్కువగా ఉంటుంది. చిరంజీవి తర్వాత అంత బాగా డాన్స్ చేసే వారిలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడు అని తాజా ఇంటర్వ్యూలో సుమన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: