స్టార్ హీరోలు నటించిన సినిమాలకు, అలాగే స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన సినిమా లకు మొదటి మూడు రోజులు అత్యధిక కలెక్షన్ లు  రావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అలాగే కొన్ని మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా మూడవ రోజు మంచి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తుంటాయి. ఇది ఇలా ఉంటే మూడవ రోజు కొన్ని సినిమాలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కూడా మంచి కలెక్షన్లను అందుకుంటూ వుంటాయి. అలా మూడవ రోజు హైదరాబాద్ సిటీలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన 5 సినిమాల గురించి తెలుసుకుందాం.
 
ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా 9.57 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


పుష్ప పార్ట్ 1 : అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 మూవీ మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో 4.1 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా సాధించింది.


సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో 3.16 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా సాధించింది.


భీమ్లా నాయక్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా నిత్యా మీనన్ , సయుక్త మీనన్  హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో 3.8 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా సాధించింది.


రాధే శ్యామ్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా మూడవ రోజు హైదరాబాద్ సిటీ లో 3.1 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: