వివాదాస్పద హీరోయిన్ పూనమ్ కౌర్ రహస్య వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో  విపరీత మైన చర్చ మొదలైంది. దానికి ఆమె షేర్ చేసిన ఫోటో కారణమైంది.

నార్త్ ఇండియాలో కార్వా చౌత్ హిందువుల పండగల్లో ప్రధానమైనది. ఆ రోజు పెళ్ళైన మహిళలు పూజలు చేస్తారు. తమ భర్తల ఆశీర్వాదం తీసుకుంటారు. కట్టుకున్న భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. ఈ పండగనాడు జల్లెడలో వాళ్ల భర్త ముఖాన్ని భార్యలు చూడడం ఒక ఆనవాయితీ. పెళ్ళైన పలువురు హీరోయిన్స్, సెలెబ్రిటీలు కార్వా చౌత్ జరుపుకున్నారు. తమ భర్తల ముఖాలు జల్లెడలో చూస్తున్న ఫోటోలు షేర్ చేశారు.


కాగా పూనమ్ కౌర్ కార్వా చౌత్ జరుపుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పండగ పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరుపుకుంటారు. కానీ జల్లెడలో ముఖం చూసేది పెళ్ళైన అమ్మాయిలు మాత్రమే. ఈ క్రమంలో పూనమ్ కౌర్ కి రహస్య వివాహం జరిగి ఉంటుంది. ఆ విషయాన్ని ఆమె దాచి పెట్టారని నెటిజెన్స్ వాళ్ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జల్లెడలో ఒక వ్యక్తి ముఖం చూస్తున్నట్లు ఆమె ఫేక్ ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి. అవతల ఉన్న వ్యక్తి ఎవరో ఫొటోలో పూనమ్ కౌర్  మాత్రం రివీల్ చేయలేదు.

అయితే తరచుగా పూనమ్ ఇలాంటి అర్థం లేదని సోషల్ మీడియా  ఎప్పుడూ పోస్ట్స్ పెడుతుంటారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ పరోక్ష కామెంట్స్ చేస్తూ ఉంటారు. పబ్లిసిటీ కోసం పూనమ్ ఇలాంటి చర్యలకు పాల్పడతారనే వాదన ఉంది. ఇలా కార్వా చౌత్ జరుపుకోవడం, జల్లెడలో ముఖం చూడటం పబ్లిసిటీ స్టంట్ లో భాగమే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. కేవలం సెన్సేషన్ కోసం పూనమ్ అలాంటి ఫోటో షేర్ చేశారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
 

ఈ మధ్య సుప్రీం కోర్ట్ తీర్పుపై కూడా పూనమ్ ఆసక్తికర మైన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లు గర్భం దాల్చే సామర్థ్యాన్ని స్వార్ధానికి వాడుకుంటున్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా పురుషులు వివాహ బంధానికి కట్టుబడి ఉండేలా చేయడానికి, తమ భద్రత కోసం కూడా పునరుత్పత్తి సామర్థ్యం ఉపయోగిస్తున్నారని పూనమ్  కామెంట్ చేయడం జరిగింది. 2006లో విడుదలైన మాయాజాలం మూవీతో పూనమ్ కౌర్ వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత ఒక వి చిత్రం, శౌర్యం, వినాయకుడు, గణేష్, నాగవల్లి, ఈనాడు, గగనం, పయనం ఇలా… పలు చిత్రాల్లో నటించారు. హీరోయిన్ గా  ఆమెకు ఇంకా బ్రేక్ రాలేదు మరి

మరింత సమాచారం తెలుసుకోండి: