
ఇక ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్లింప్స్ కూడా రెడీ అయ్యింది. అయితే దసరా సందర్భంగా టైటిల్‌ను ప్రకటించాలనుకున్నారు. కానీ అప్పట్లో రవితేజ చేతిలో మరో భారీ సినిమా ‘మాస్ జాతర’ రిలీజ్ అవుతోంది. ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా ప్రమోషన్స్ దెబ్బతినకుండా ఉండేందుకే, కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ వంటివి కొంచెం లేట్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో కేతిక శర్మ, అషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇద్దరికీ బాగానే స్కోప్ ఇచ్చేలా కథను రాసినట్టు సమాచారం. కిషోర్ తిరుమల సినిమాలు ఎప్పుడూ ఎమోషన్స్‌తో పాటు ఫ్యామిలీ అటాచ్‌మెంట్‌ని బలంగా చూపిస్తాయి. అందుకే ఈసారి కూడా రవితేజ వేరే షేడ్స్‌లో కనిపించే అవకాశముంది.
2026 సంక్రాంతికి రానున్న సినిమాల్లో అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌గానే ఉన్నాయి. చిరు ‘మన శివ శంకర ప్రసాద్‌గారు’, ప్రభాస్ ‘రాజాసాబ్’, ఇప్పుడు రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. అన్నీ ఎమోషనల్ టచ్‌తో కూడిన ఫ్యామిలీ డ్రామాలు కావడంతో సంక్రాంతి రేసు చాలా ఆసక్తికరంగా మారబోతోంది. ‘మాస్ జాతర’ తర్వాత రవితేజ ఈ సినిమా ద్వారా మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను దోచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. టైటిల్ వింటూనే ఒక ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా అనిపిస్తోంది. కిషోర్ తిరుమల ఎమోషనల్ హ్యాండ్లింగ్‌తో, రవితేజ ఎనర్జీ కలిస్తే.. ఈ సంక్రాంతికి థియేటర్లలో పండగ వాతావరణం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు. ఇక రాబోయే నెలల్లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ లుక్, గ్లింప్స్ వస్తే మరింత హంగామా మొదలవుతుంది. సంక్రాంతి 2026లో బాక్సాఫీస్ వద్ద రవితేజ మళ్లీ హంగామా చేయడం ఖాయం!